ఒక్క రోజే 88 వేల పాజిటివ్ కేసులు.. 1124 మరణాలు
By సుభాష్ Published on 27 Sep 2020 5:57 AM GMTభారత్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 9,87,861 కరోనా పరీక్షలు చేయగా, 88,600 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే రోజువారీగా పాజిటివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరటనిస్తోంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో..
పాజిటివ్ కేసులు - 88,600
మరణాలు - 1124
కోలుకున్న వారు - 92వేలు
దేశంలో మొత్తం కేసుల సంఖ్య - 59 లక్షల 92 వేలు
మొత్తం మరణాలు - 94,503
ఇప్పటి వరకు కోలుకున్నవారు - 49 లక్షలు
ప్రస్తుతం యాక్టివ్ కేసులు - 9 లక్షల 56 వేలు
దేశ వ్యాప్తంగా రికవరీ రేటు - 82.46 శాతం
మరణాల రేటు -1.58 శాతం
కాగా, భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువకాగా, అమెరికాలో ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు అమెరికాలో 2 లక్షల 4వేల మంది కరోనాతో మృతి చెందారు.