తెలంగాణలో 1,967 పాజిటివ్‌ కేసులు.. 9 మరణాలు

By సుభాష్  Published on  27 Sep 2020 3:52 AM GMT
తెలంగాణలో 1,967 పాజిటివ్‌ కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1967 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 9 మంది మృతి చెందారు. ప్రతి రోజు కూడా మరణాల సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

గడిచిన 24 గంటల్లో ..

పాజిటివ్‌ కేసుల సంఖ్య – 1,967

మరణాల సంఖ్య – 9

కోలుకున్నవారు – 2,058

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -1,85,833

మొత్తంమరణాల సంఖ్య – 1100

మొత్తం యాక్టివ్‌ కేసులు – 30,234

ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య – 24,607

రాష్ట్రంలో కోలుకున్నవారు – 1,54,499

రాష్ట్రంలో మరణాల రేటు – 0.59 శాతం

దేశంలో మరణాల రేటు – 1.57 శాతం

రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు – 83.13 శాతం

దేశంలో కోలుకున్నవారి రేటు – 82.39 శాతం

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసుల జిల్లాలు

జీహెచ్‌ఎంసీ – 297

కరీంనగర్‌ – 152

మేడ్చల్‌ మల్కాజిగిరి -137

నల్గొండ -105

రంగారెడ్డి – 147 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story