దారుణం.. యువ‌తిపై జొమాటో డెలివ‌రీ బాయ్ దాడి.. వీడియో వైర‌ల్‌

Zomato delivery boy punches woman leaves her bleeding.యువ‌తి పుడ్ ఆర్డ‌ర్ చేయ‌గా.. స‌మ‌యానికి రాలేదు. దీంతో ఆర్డ‌ర్‌ను క్యాన్సిల్ చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం జ‌రిగింది. స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు డెలివరీ బాయ్ ఆ యువ‌తి ముఖం పై పిడిగుద్దులు గుద్దాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2021 3:36 PM IST
Zomato delivery boy punches woman leaves her bleeding.

ఇటీవ‌ల కాలంలో డెలీవ‌రి బాయ్‌లు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఘ‌టన‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ యువ‌తి పుడ్ ఆర్డ‌ర్ చేయ‌గా.. స‌మ‌యానికి రాలేదు. దీంతో ఆర్డ‌ర్‌ను క్యాన్సిల్ చేసింది. స‌రిగ్గా అదే స‌మ‌యానికి డెలివ‌రీ బాయ్ అక్క‌డ‌కు వ‌చ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం జ‌రిగింది. స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు డెలివరీ బాయ్ ఆ యువ‌తి ముఖం పై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆ యువ‌తి ముక్కులోంచి ర‌క్తం వ‌చ్చింది. త‌న అనుభ‌వాన్ని వివ‌రిస్తూ ఆ యువ‌తి వీడియో చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియో ఏం ఉందంటే..? బెంగ‌‌ళూరుకి చెందిన మేక‌ప్ ఆర్టిస్ట్ హితేషా చంద్రానీ మంగ‌ళ‌వారం (మార్చి 9) న మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు జొమాటోలో ఓ పుడ్ ఐట‌మ్‌ను ఆర్డ‌ర్ ఇచ్చింది. అది సాయంత్రం 4.30గంట‌ల క‌ల్లా డెలివ‌రీ చేయాల్సి ఉంది. అయితే.. స‌మ‌యానికి ఆ ఆర్డర్ రాలేదు. చాలా సేపు చూసిన త‌రువాత‌.. ఆర్డ‌ర్ ఆల‌స్యం కావ‌డంపై ఆ సంస్థ క‌స్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడింది. తన ఆర్డ‌ర్‌ను క్యాన్సిల్ చేయాల‌ని కోరింది. ఇంత‌లో డెలివ‌రీ బాయ్ కామ‌రాజ్ అక్క‌డ‌కు చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.


దీంతో ఆగ్ర‌హించిన కామ‌రాజ్ ఆమెపై పిడిగుద్దు వ‌ర్షం కురిపించాడు. అనంత‌రం తెచ్చిన ఆర్డ‌ర్ తీసుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌ని ఆ యువ‌తి ఆ వీడియో పేర్కొంది. జొమాటో సేవ‌లు సుర‌క్షిత‌మేనా అంటే వాపోయింది. త‌న‌కు మ‌ద్ద‌తు నిలవాలంటూ కోరింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. యువ‌తిపై దాడి చేయ‌డం హేయ‌మైన చ‌ర్య అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించాల‌ని కోరుతున్నారు.


Next Story