విషాదం.. గూగుల్ మ్యాప్ సాయంతో బ‌య‌లుదేరిన యువకుడు ఇంటికి చేరుకోకుండానే..

గూగుల్ మ్యాప్ ఉపయోగించి ఢిల్లీ నుంచి ధాంపూర్ వస్తున్న యువకుడు దారితప్పి కొత్వాలి దేహత్ రోడ్డుకు చేరుకున్నాడు.

By Medi Samrat  Published on  12 Dec 2024 3:31 AM GMT
Young man died, bike collided with a pole, Google Map, Delhi

గూగుల్ మ్యాప్ సాయంతో బ‌య‌లుదేరిన యువకుడు ఇంటికి చేరుకోకుండానే..

గూగుల్ మ్యాప్ ఉపయోగించి ఢిల్లీ నుంచి ధాంపూర్ వస్తున్న యువకుడు దారితప్పి కొత్వాలి దేహత్ రోడ్డుకు చేరుకున్నాడు. మలుపు తెలియకపోవడంతో బైక్‌ ఫ్లాక్స్‌ పోల్‌ను ఢీకొని మృతి చెందాడు. మృతి చెందిన యువ‌కుడు హెల్మెట్ ధరించలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ధాంపూర్ నివాసి నజీర్ అహ్మద్ (21) ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. బుధవారం ఢిల్లీ నుంచి బైక్‌పై తిరిగి వస్తున్నాడు. అతడు సరైన ప్రదేశానికి చేరుకోవడం కోసం Google Mapని ఇన్‌స్టాల్ చేశాడు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నహతౌర్‌లోని కొత్వాలి దేహత్‌ రోడ్డులోని ఆక్స్‌ఫర్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో దారి తప్పి మలుపును అంచనా వేయలేక బైక్‌ కంకరపై అదుపు తప్పి ఫ్లాక్స్‌ బోర్డు పోల్‌ను ఢీకొట్టింది. దీంతో యుకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాటసారుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువ‌కుడిని సీహెచ్‌సీకి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందిన వెంటనే బంధువులు సీహెచ్‌సీకి చేరుకున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం నజీర్ ఇంట్లో సంభాషణ జరిగింది. తాను గూగుల్ మ్యాప్ ద్వారా ఇంటికి బయలుదేరానని.. అయితే నహ్తౌర్ ప్రాంతంలో గూగుల్ మ్యాప్ తనను తప్పుదారి పట్టించిందని.. అతడు ధాంపూర్‌కు బదులుగా కొత్వాలి దేహత్ రోడ్ వైపు వెళ్లాడని.. దీంతో ప్రమాదం జరిగిందన్నారు. మృతుని బంధువులు పోలీసు చర్యల‌ను నిరాకరించార‌ని కొత్వాల్ ధీరజ్ సింగ్ చెప్పారు. ఫిర్యాదు అందితే విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

గ‌తంలో కూడా గూగుల్ మ్యాప్ కార‌ణంగా ప్రమాదాలు జరిగాయి. ఇటీవల బరేలీలో ముగ్గురు చనిపోయారు. ఫరూఖాబాద్‌కు చెందిన నితిన్, అజిత్, అమిత్ గూగుల్ మ్యాప్ సాయంతో తెల్లవారుజామున కారులో ఫరీద్‌పూర్ (బరేలీ) వెళ్తున్నారు. ముడా గ్రామ సమీపంలోని రామగంగపై అసంపూర్తిగా ఉన్న వంతెన కారణంగా రహదారి మూసివేయబడింది.. అయినప్పటికీ అది మ్యాప్‌లో స‌రిగానే కనిపించింది. అక్కడ ఉన్న ఇటుక గోడను కూడా కొందరు గ్రామస్తులు కూల్చివేశారు. ఈ విషయం తెలియక యువకుడు ముందుకు వెళ్లడంతో కారు బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో ముగ్గురూ మృతి చెందారు.

ఈ కేసులో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ మహ్మద్ ఆరిఫ్, అభిషేక్ కుమార్, జూనియర్ ఇంజనీర్ అజయ్ గంగ్వార్, మహరాజ్ సింగ్‌లపై డేటాగంజ్‌లోని నాయబ్ తహసీల్దార్ ఛవీరామ్ నేరపూరిత నరహత్య సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గూగుల్ మ్యాప్‌లో రూట్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని.. అక్క‌డి ప్రాంతీయ అధికారులు కూడా బాధ్యులని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Next Story