ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం నాడు CM యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ కంటే పెద్ద హిందువు ఎవరో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇండియా టీవీ 'చునావ్ మంచ్ 2022'లో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, యోగి, అఖిలేష్ మధ్య పోరు ప్రధాని నరేంద్ర మోదీ కంటే పెద్ద హిందువు ఎవరో నిరూపించడానికి ఉన్నట్లుందని అన్నారు.
రాష్ట్రంలో అత్యంత బలహీన రాజకీయ నాయకుడు అఖిలేష్ యాదవ్ అని ఒవైసీ అన్నారు. 2014, 2017, 2019లో అఖిలేష్ నాయకత్వంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల్లో పోటీ చేసిందని, అయితే ప్రతిసారీ ఓడిపోయిందని ఆయన అన్నారు.తమ స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడే ముస్లిం ఓటుకు విలువ ఉంటుందని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు బైపోలార్‌గా ఉండబోవని ఒవైసీ అన్నారు. 'సబ్కా సాథ్ సబ్కా వికాస్' అంటూ బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ముస్లింల పట్ల బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై ఒవైసీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల పేద జీవితానికి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీలేనని అన్నారు. ముస్లింల కోసం ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బుజ్జగింపులు చేస్తున్నారనేది వాస్తవమని అన్నారు.