గ్రాండ్ఈవెంట్ గా ప్రమాణ స్వీకారం
By - Nellutla Kavitha | Published on 21 March 2022 4:53 PM ISTఉత్తరప్రదేశ్లో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండవసారి అధికారం చేపట్టబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారాయన. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకన క్రికెట్ స్టేడియంలో 25 న శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ప్రమాణ స్వీకారాన్ని గ్రాండ్ ఈవెంట్ గా జరపడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి 60 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ని ఆహ్వానించనున్నారు. వీరితోపాటు200 VVIP లు మంది హాజరవుతారని అనుకుంటున్నారు.