నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌ మహిళా కమెండోలు

women commandos inducted into elite anti-Maoist CoBRA unit. నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సీఆర్‌పీఎఫ్‌ మహిళా కమెండోలు.

By Medi Samrat
Published on : 7 Feb 2021 3:24 AM

women commandos

నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్..‌ మహిళా కమెండోలను రంగంలోకి దింపనుంది. సీఆర్పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్పీఎఫ్‌ తెలిపింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్‌ ఏర్పాటు చేసిన ఘనత సీఆర్‌పీఎఫ్‌కే దక్కిందని తెలిపింది. సీఆర్‌పీఎఫ్‌ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను ఏరివేస్తామని సీఆర్‌పీఎఫ్‌ స్పష్టం చేస్తోంది.

అయితే సీఆర్‌పీఎఫ్‌ మహిళా బెటాలియన్‌లో 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఏపీ మహేశ్వరి తెలిపారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్‌ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయన్నారు. విధి నిర్వహణలో భాగంగా సీఆర్‌పీఎఫ్ దళం అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తోందని అన్నారు.


Next Story