'నా మృతదేహం అడవిలో వేలాడుతోంది.. వచ్చి చూడు'.. వైరల్‌ అవుతున్న మహిళ ఆడియో

Woman in hamirpur is telling the address of her dead body on phone. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఒక ప్రత్యేకమైన కేసు తెరపైకి వచ్చింది. ఇది వింటే మీ శరీరం గూస్‌బంప్స్‌

By అంజి  Published on  21 Dec 2022 10:02 AM GMT
నా మృతదేహం అడవిలో వేలాడుతోంది.. వచ్చి చూడు.. వైరల్‌ అవుతున్న మహిళ ఆడియో

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఒక ప్రత్యేకమైన కేసు తెరపైకి వచ్చింది. ఇది వింటే మీ శరీరం గూస్‌బంప్స్‌ కావడం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మహిళ ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆ మహిళ.. తన మృతదేహం అడవిలో వేలాడుతున్నదని.. వెళ్లి చూడు అని ఏడుస్తూ చెప్పింది. వైరల్ అవుతున్న ఆడియోలో నిషా అనే మహిళ తన సోదరుడితో ఫోన్‌లో మాట్లాడుతోంది. తన మృతదేహం అడవిలో వేలాడుతున్నదని ఆమె ఏడుస్తూ చెప్పింది. అదే సమయంలో.. అదే పేరుతో ఉన్న మహిళ తప్పిపోయినట్లు పోలీసు స్టేషన్‌లో నమోదు చేయబడింది. అయితే వైరల్ అవుతున్న ఆడియోను న్యూస్‌మీటర్‌ ధృవీకరించలేదు.

వైరల్ ఆడియోలో.. డిగ్గీ నివాసి సతీష్ డబ్బు వసూలు చేయడానికి నలుగురిని పిలిచాడని మహిళ తన సోదరుడికి ఏడుస్తూ చెప్పింది. ఇద్దరు వ్యక్తులు తనను కారులో తీసుకెళ్లారని చెప్పింది. వాళ్ళు తనను చంపి అడవిలో ఉరితీసి చెట్టకు వేలాడదీశారని చెప్పింది. దీంతో నిషా సోదరుడు.. హమీర్‌పూర్‌కు వస్తున్నానని చెప్పాడు. ఆ యువతి.. తన సోదరుడి భార్యతో మాట్లాడుతూ.. అడవిలో తన మృతదేహం ఉంది.. వచ్చి చూడు అని చెప్పింది.

వైరల్‌ అవుతున్న ఆడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అదే సమయంలో తన కుమార్తె కనిపించడం లేదని డిసెంబర్ 17న కాన్షీరామ్ కాలనీకి చెందిన బుల్బులియా సదర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. తన కుమార్తె నిషా డిసెంబర్ 15న తన సోదరుడు ముఖేష్‌ను తన ఖాతాలో డబ్బులు వేయమని చెప్పి వెళ్లిపోయిందని అందులో పేర్కొన్నారు. అయితే ఆమె ఇంటికి చేరుకోలేదు, తప్పిపోయిన మహిళ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమె నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఈ ఘటనకు వైరల్‌గా మారిన ఆడియోకు ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఆడియోకు చెందిన మహిళ నగరంలోని కాన్షీరాం నివాసి. అతని సోదరుడు ఢిల్లీలో ఉండేవాడు. ఆయన సోమవారం ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. ఈ విషయమై పోలీసులు అతడిని కూడా ప్రశ్నించారు. తనతో మాట్లాడుతున్న మహిళ.. తన అక్క అని పోలీసులకు చెప్పాడు. అతను జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు.

నిషా మొబైల్ నంబర్, ఆమె కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిషా ఏ నంబర్‌లో ఎక్కువగా మాట్లాడిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో డిగ్గీలో నివసిస్తున్న సతీష్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.

నిషా అనే మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు. అదే సమయంలో ఆడియో వైరల్ కావడంతో పోలీసులు కూడా సందిగ్ధంలో పడ్డారు. పోలీసులు ఇప్పుడు లింక్‌లను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మహిళ ఆడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది. మహిళ ఆడియో వైరల్‌గా మారడం యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిపై హత్య కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు త్వరలో అరెస్టు చేసి విషయం వెల్లడిస్తామని చెప్పారు.

Next Story