బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీపై ఓ మహిళ చెప్పులు విసిరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఇటువంటి నాయకులు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. అందుకే నేను పాదరక్షలు విసిరాను అని ఆ మహిళ అతనిపై చెప్పులు విసిరిన తర్వాత చెప్పింది. నేను మందులు కొనుక్కోవడానికి ఇక్కడకు వచ్చాను. అతను ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనడానికి పేదలను దోచుకున్నాడు. అతన్ని కట్టేసి వీధిలో ఈడ్చాలి. నేను నా పాదరక్షలు లేకుండా ఇంటికి వెళ్తాను అని పేర్కొంది.
అంతకుముందు రోజు.. తన ఫ్లాట్ల నుండి రికవరీ చేసిన డబ్బు గురించి అర్పిత మాట్లాడుతూ, "డబ్బు నాది కాదు.. నేను లేనప్పుడు అక్కడే ఉంచారు" అని చెప్పింది. కోల్‌కతాలోని ఆమె ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.50 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సి రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి పార్థ ఛటర్జీ, అర్పిత ఇద్దరినీ ఆగస్టు 3 వరకు ఈడీ కస్టడీకి పంపారు. అర్పిత ఫ్లాట్లలో రూ. 50 కోట్లు దొరికిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి పార్థ ఛటర్జీని సస్పెండ్ చేసింది. ఈడీ అరెస్టు అనంతరం మంత్రివర్గం నుండి కూడా తొలగించింది.