సీఆర్పీఎఫ్ బంకర్‌పై బాంబు విసిరిన మహిళ.. వీడియో వైరల్

Woman hurls bomb at CRPF bunker in Kashmir’s Sopore.జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప‌ట్ణంలోని సీఆర్పీఎఫ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 1:29 PM IST
సీఆర్పీఎఫ్ బంకర్‌పై బాంబు విసిరిన మహిళ.. వీడియో వైరల్

జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప‌ట్ణంలోని సీఆర్పీఎఫ్ బంక‌ర్‌పై మంగ‌ళ‌వారం ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ బాంబు దాడి చేసింది. బుర్ఖా ధరించి వచ్చిన మహిళ తన బ్యాగులో ఉన్న బాంబును బయటకు తీసి క్యాంపు వైపు విసిరి పరారైంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సీఆర్పీఎఫ్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే.. అదృష్ట వ‌శాత్తు ఈ దాడిలో ఎటువంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్ల‌లేదు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మొత్తం దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సీఆర్పీఎఫ్ బంకర్‌పై బాంబు విసిరిన మహిళను గుర్తించామని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. త్వ‌ర‌లోనే ఆ మ‌హిళ‌ను అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని.. విచారణ తర్వాత మొత్తం వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌న్నారు.

మరోవైపు శ్రీనగర్ లోని రైనావారి ప్రాంతంలో ఈ రోజు తెల్ల‌వారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Next Story