వృద్దురాలి దెబ్బ‌కు.. పారిపోయిన చిరుత‌

Woman fights off Leopard with walking stick.హ‌ఠాత్తుగా చిరుతపులి వ‌స్తే.. ఎవ‌రికైనా స‌రే వెన్నులో వ‌ణుకు పుట్ట‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2021 11:04 AM GMT
వృద్దురాలి దెబ్బ‌కు.. పారిపోయిన చిరుత‌

హ‌ఠాత్తుగా చిరుతపులి వ‌స్తే.. ఎవ‌రికైనా స‌రే వెన్నులో వ‌ణుకు పుట్ట‌డం స‌హ‌జం. చిరుత దాడి చేయ‌క ముందే భ‌యంతోనే స‌గం ప్రాణాలు పోతాయి. అయితే.. ఓ వృద్దురాలు మాత్రం ఎంతో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించింది. చేతి కర్ర‌తో త‌న‌పై దాడి చేసేందుకు వ‌చ్చిన చిరుతను త‌రిమి కొట్టింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ముంబ‌యి శివారులోని ఆరే కాలేనీలో నిర్మ‌లా దేవి సింగ్‌(55) అనే వృద్దురాలు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. బుధ‌వారం రాత్రి(సెప్టెంబ‌ర్ 29న‌) ఇంటి ముందు ఆమె కూర్చొంది. ఆమెకు కొద్ది దూరంలో ఓ చిరుత న‌క్కి ఉంది. ఈ విష‌యాన్ని ఆ వృద్దురాలు గ‌మ‌నించ‌లేదు. స‌మ‌యం చూసి చిరుత వృద్దురాలిపైకి దాడికి దిగింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన వృద్దురాలు త‌న చేతిక‌ర్ర‌(వాకింగ్ స్టిక్‌)తో చిరుత‌పై కొట్ట‌డంతో అది అక్క‌డి నుంచి పారిపోయింది. వృద్దురాలి కేక‌ల‌తో ఇంట్లో ఉన్న వారు బ‌య‌ట‌కు ప‌రుగెత్తుకుని వ‌చ్చారు. చిరుత దాడిలో ఆమెకు స్వ‌ల్పంగా గాయాలు అయ్యాయి. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Next Story