కదులుతున్న రైల్లో నుంచి జారిపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబై బోరివలి స్టేషన్‌లో ఘోర ప్రమాదం తప్పింది.
By Knakam Karthik
కదులుతున్న రైల్లో నుంచి జారిపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబై బోరివలి స్టేషన్‌లో ఘోర ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు నుంచి ప్లాట్ ఫారమ్‌పైకి దిగడానికి యత్నించిన ఓ మహిళ రైలు కింద పడిపోయే సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను రక్షించిన ఘటన చోటు చేసుకున్నది. ఘటనకు సంబంధిచిన వీడియోను భారత రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రైల్వే పోలీస్ చేసిన సాయాన్ని 'మిషన్ జీవన్ రక్ష'గా అభివర్ణించింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని బోరివలి స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతున్నప్పుడు ఒక మహిళ బ్యాలెన్స్ కోల్పోయి రైలు-ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆమెను పైకి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆయన చర్య అభినందనీయం. ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని రైల్వేశాఖ పేర్కొన్నది.
महाराष्ट्र के बोरीवली रेलवे स्टेशन पर एक महिला चलती ट्रेन से उतरते समय असंतुलित होकर गिर पड़ी। वहां मौजूद रेलवे सुरक्षाकर्मी ने तत्परता दिखाते हुए उसे बचा लिया।कृपया चलती ट्रेन से चढ़ने या उतरने की कोशिश न करें।#MissionJeevanRaksha pic.twitter.com/6R8FALdD0d
— Ministry of Railways (@RailMinIndia) March 9, 2025