సార్‌.. నా ప్రియుడు నాతో మాట్లాడటం లేదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

Woman Calls Police Asking Them To Help Her Reconnect With Her Boyfriend. ప్రేమ ప్రేమికులను పిచ్చి పనులు చేయిస్తుంది. అందుకు తాజా జరిగిన ఘటనే నిదర్శనం. ఓ ప్రియురాలు తన ప్రియుడు తనతో మాట్లాడటం లేదని పోలీసులను ఆశ్రయించింది.

By అంజి  Published on  21 Nov 2021 10:53 AM IST
సార్‌.. నా ప్రియుడు నాతో మాట్లాడటం లేదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

ప్రేమ ప్రేమికులను పిచ్చి పనులు చేయిస్తుంది. అందుకు తాజా జరిగిన ఘటనే నిదర్శనం. ఓ ప్రియురాలు తన ప్రియుడు తనతో మాట్లాడటం లేదని పోలీసులను ఆశ్రయించింది. ఎలాగైనా తన ప్రియుడిని తనతో మాట్లాడేలా చేయాలని, అతడు లేకుండా నేను ఉండలేనని పోలీసులకు పిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరణికి చెందిన ఓ వ్యక్తితో చింధ్వారకు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. దీంతో అది ఇద్దరి మధ్య సహజీవనానికి దారి తీసింది. ఇటీవల తన ప్రియుడి పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజున మహిళ శుభాకాంక్షలు తెలపకపోవడంతో.. అతడు ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చిలికి చిలికి కాస్తా పెద్దదిగా మారింది.

అప్పటి నుండి ఆ మహిళతో అతడు మాట్లాడటం మానేశాడు. దీంతో ప్రియుడిపై బెంగ పెట్టుకున్న ఆ మహిళకు ఏం చేయాలో పాలు పోలేదు. అతడు మాట్లాడుతాడేమోనని చాలా రోజుల పాటు వేచి చూసింది. అయినా కూడా ఆమె వంక చూడటానికి ఇష్టపడలేదు. మహిళ అతనితో సన్నిహితంగా ఉండటానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సదరు మహిళ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి.. దంపతులకు కొన్ని గంటలపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చివరకు రాజీ కుదుర్చిన పోలీసులు పెళ్లి చేసుకోవాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించారు. చివరికి ఆర్యసమాజ్ మందిర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ఆ మహిళ తన ప్రియుడిని దక్కించుకుంది.

Next Story