ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. లక్నో పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఆ మెసేజ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీఎం యోగిపై బాంబు దాడి చేయనున్నట్లు లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్‌కు ఆగస్టు 2న మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే సీఎంకు పోలీసులు భద్రతను మరింత పెంచారు.
ఆ సందేశం ఆధారంగా హెల్ప్‌లైన్ ఆపరేషన్ కమాండర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెదింపులకు పాల్పడిన వ్యక్తిని కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. సుషాంత్ గోల్ఫ్ సిటీ పీఎస్‌లో ఈ కేసును రిజిస్టర్ చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు సీఎం యోగికి బాంబు బెదిరింపు హెచ్చరిక వచ్చింది. ఈ క్రమంలోనే యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడిగా మారిన సన్యాసి యోగి ఆదిత్యనాథ్‌కు గతంలో పలుసార్లు బెదిరింపులు వచ్చాయి.