జస్టిస్ సంజీవ్ ఖన్నా దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఆయన నవంబర్ 11న 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సీజేఐ డీవై చంద్రచూడ్ తన పదవి నుంచి నవంబర్ 10న పదవీ విరమణ చేయనుండడం గమనార్హం. శుక్రవారం చంద్రచూడ్ చివరి వర్కింగ్ డే.
అయితే.. సీజేఐగా ప్రమాణం చేయకముందే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు ఆయన మార్నింగ్ వాక్ కు వెళ్లలేకపోతున్నారు. నివేదికల ప్రకారం.. జస్టిస్ ఖన్నాకు ప్రతిరోజూ 10 కిలోమీటర్లు నడిచే అలవాటు ఉంది. ఆయన ఎప్పుడూ మార్నింగ్ వాక్‌కి ఒంటరిగా బయటకు వెళ్లేవారు. లోధీ గార్డెన్‌లో ఆయన వాకింగ్ చేసేవారు. అయితే సీజేఐ అయిన తర్వాత ఆయన ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది.. దాని కింద భద్రతా సిబ్బందితో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాకింగ్‌ను విడిచిపెట్టారు.
నివేదికల ప్రకారం.. CJI నోటిఫికేషన్‌లో.. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒంటరిగా వాకింగ్‌కు వెళ్లవద్దని, భద్రతా సిబ్బందితో వెళ్లాలని సూచించారు. అటువంటి పరిస్థితిలో ఆయన సెక్యూరిటీతో వాకింగ్ చేయనని నిర్ణయించుకున్నాడు.
అంతకుముందు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను ఆయన ప్రశంసించారు.