భారతీయ జనతా పార్టీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో ప్రయత్నించిన సంగతి తెలిసిందే..! తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఒంటరిని చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అనుకున్నట్లుగానే దెబ్బ కొట్టింది కూడానూ.. ఇక లేటెస్ట్ గా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వీటిలో కూడా బీజేపీ విజయం సాధిస్తుంది అంటూ వచ్చాయి. బీజేపీ అనుకున్నట్లుగానే జెండా పాతబోతోందా అని తెలియాలంటే మే 2 వరకూ ఆగాల్సిందే..!
పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 148 కావాలి. కొన్ని సంస్థల సర్వేలలో బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ జెండా పాతేలా కనిపిస్తున్నా.. తృణమూల్ కాంగ్రెస్ ను మాత్రం తక్కువ అంచనా వేయకూడదని ఇంకొన్ని సంస్థలు చెబుతూ వస్తున్నాయి. గతంలో పోలిస్తే భారీగా బీజేపీ బలపడిందని మాత్రం చెప్పొచ్చు. బీజేపీకి చెందిన బడా నాయకులు బెంగాల్ లో ఎన్నో ర్యాలీలు, సభలు నిర్వహించి తృణమూల్ కాంగ్రెస్ ను బాగానే దెబ్బ తీశారు.
రిపబ్లిక్-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
టీఎంసీ... 128-138
బీజేపీ... 138-148
కాంగ్రెస్... 11-21
ఎంఐఎం... 0
ఇతరులు... 0
సీ ఓటర్-ఏబీపీ
టీఎంసీ... 152-164
బీజేపీ... 109-121
కాంగ్రెస్... 11-21
ఎంఐఎం... 0
ఇతరులు... 0
ఈటీజీ రీసెర్చ్
టీఎంసీ 164-176
బీజేపీ 105-115
కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-15
సీఎన్ఎన్ న్యూస్ 18
టీఎంసీ 162
బీజేపీ 115
కాంగ్రెస్-వామపక్ష కూటమి 15
పి మార్క్
టీఎంసీ 152-172
బీజేపీ 112-132
కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-20