రాష్ట్ర‌ విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీఎంసీ తీర్మానం.. బీజేపీ ఏం చేసిందంటే..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం షాకింగ్ దృశ్యం కనిపించింది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బిజెపి మధ్య ఓ సమస్యపై దాదాపు మొదటిసారి ఐక్యత కనిపించింది

By Medi Samrat  Published on  5 Aug 2024 3:32 PM IST
రాష్ట్ర‌ విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీఎంసీ తీర్మానం.. బీజేపీ ఏం చేసిందంటే..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం షాకింగ్ దృశ్యం కనిపించింది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బిజెపి మధ్య ఓ సమస్యపై దాదాపు మొదటిసారి ఐక్యత కనిపించింది. అసలేం జరిగిందంటే.. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా టీఎంసీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ మేరకు ఇరు పక్షాలు ఏకగ్రీవంగా ప్రతిపాదనను ఆమోదించాయి.

కొద్ది రోజుల క్రితం బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్.. బెంగాల్ విభజన డిమాండ్‌ను లేవనెత్తుతూ సంచలనం సృష్టించడం గమనార్హం. దీనిపై పలువురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మజుందార్‌ డిమాండ్‌పై బీజేపీ నేతలు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేదు. దీని ప్రభావం సోమవారం కూడా అసెంబ్లీలో కనిపించడంతో ఈ అంశంపై టీఎంసీ-బీజేపీ ఒక్కటైనంత ప‌నైంది.

ఈ ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. "మేము కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతాము. రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నాలకు మేము వ్యతిరేకం" అని అన్నారు. రాష్ట్ర విభజన ఆలోచనకు తాము వ్యతిరేకమని బీజేపీ అసెంబ్లీలో పేర్కొంది. అయితే.. బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాల అభివృద్ధిని తాను కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ‘సమైక్య పశ్చిమ బెంగాల్‌ను సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామ‌ని అన్నారు

పశ్చిమ బెంగాల్‌ను విభజించే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నామ‌ని.. అయితే సభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఒక లైన్‌ను జోడించాలని శుభేందు అధికారి విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రతిపాదనను సీఎం మమతా బెనర్జీ స‌మ్మ‌తించ‌గా.. ఈ ప్రతిపాదనను సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతకుముందు రాష్ట్ర విభజన ప్రయత్నాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ.. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే విధమైన తీర్మానాన్ని వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించింది.

Next Story