నేటి నుండి ఆ రాష్ట్రం‌లో వీకెండ్‌ కర్ఫ్యూ..

Weekend Curfew In Rajasthan. తాజాగా రాజస్తాన్‌లో కూడా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వారాంతపు కర్ఫ్యూను విధించింది.

By Medi Samrat  Published on  16 April 2021 4:27 AM GMT
curfew

దేశ శ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశ‌గా ఆలోచిస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హ‌రాష్ట్ర, ఢిల్లీల‌‌లో నైట్ క‌ర్ఫ్యూ విధించ‌గా.. తాజాగా రాజస్తాన్‌లో కూడా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆ బాటలోనే నడుస్తోంది. ఈ మేర‌కు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి వారాంతపు కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. సోమవారం వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ మార్గదర్శకాలను కొన్ని గంటల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

కరోనా కేసులు పెరుగుతున్న కార‌ణంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ విధిస్తున్నాం. కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వానికి సహకరించాలి, కోవిడ్‌ నిబంధనలను పాటించాలి అని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలుత నైట్‌ కర్ఫ్యూలను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న 10 రాష్ట్రాల్లో రాజస్తాన్‌ కూడా ఒకటిగా నిలవడంతో.. వీకెండ్‌ కర్ఫ్యూకు సిద్ధమైంది.






Next Story