జస్ట్‌ మిస్‌.. వ్యక్తి నడిచిన వెంటనే కుంగిన ఫుట్‌పాత్‌.. లేదంటేనా.!

Viral.. Footpath cracks open moments after man walks over it. ఓ వ్యక్తికి జస్ట్‌ మిస్‌లో ప్రమాదం తప్పింది. అతడు ఓ షాపుకు నడుచుకుంటూ వచ్చిన వెంటనే ఫుట్‌పాత్‌ కుంగిపోయింది. ఒ

By అంజి  Published on  4 Aug 2022 7:09 PM IST
జస్ట్‌ మిస్‌.. వ్యక్తి నడిచిన వెంటనే కుంగిన ఫుట్‌పాత్‌.. లేదంటేనా.!

ఓ వ్యక్తికి జస్ట్‌ మిస్‌లో ప్రమాదం తప్పింది. అతడు ఓ షాపుకు నడుచుకుంటూ వచ్చిన వెంటనే ఫుట్‌పాత్‌ కుంగిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం అయినా అతడు తీవ్ర గాయాల పాలయ్యేవాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీనికి సంబంధిచిన వీడియో రెడ్డిట్‌లో పోస్ట్‌ చేయడంతో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచాడు. అయితే అతడు మెట్లపై కాలు పెట్టిన వెంటనే ఆ ఫుట్‌పాత్‌ కిందకు కుంగి కూలింది. దాని కింద లోతులో డ్రైనేజ్‌ ఉంది. దీంతో ఆ వ్యక్తి ఈ షాకయ్యాడు.

చాలా సేపటి వరకు ఆ ఘటన నుంచి తేరుకోలేకపోయాడు. తాను అదృష్టవంతుడిని అని అనుకున్నాడు. ఫుట్‌పాత్‌ కుంగిపోవడం చూసి ఆ షాప్‌లోని వ్యక్తులు కూడా హడావుడిగా బయటకు వచ్చారు. డ్రైనేజీలోకి కుంగిన ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియ రాలేదు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందించారు. ఒకరేమో.. ఆ ఫుట్‌పాత్‌ అతడి వల్లే కుంగిందని, దానికి ఆయనే డబ్బులు చెల్లించాలని సరదాగా కామెంట్‌ చేయగా, మరొక నెటిజన్‌.. ఆ వ్యక్తి దేశంలో బలమైన వ్యక్తిగా చమత్కరించారు.


Next Story