అదృష్టం ఉండాలే కానీ.. మనం వెతకకుండానే బంగారు నాణేలు మన సొంతం అవుతాయి. మన దేశంలోనే ఎక్కడో ఓ చోట వజ్రాలు దొరకడం వాటి కోసం జనాలు పరుగులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ నదిలో ఎనిమిది రోజుల క్రితం మత్స్యకారులకు బంగారు, వెండి నాణేలు దొరికాయి. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇంకేంముంది.. వెంటనే జనాలు తండోపతండాలుగా అక్కడ చేరారు. నదిలో ఉన్న బురద నీళ్లు ఎత్తిపోస్తూన్నారు నాణేల కోసం.
రాజ్‌ఘర్ జిల్లాలోని పార్వతి నదిలో ఎనిమిది రోజుల క్రితం కొంతమంది మత్స్యకారులకు బంగారు, వెండి నాణేలు దొరికాయి. ఈ వార్త ఆనోటా ఈనోటా అందరి చెవుల్లో పడింది. దీంతో రాజ్‌ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్‌పూరా గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. నదిలోకి దిగి నాణేల కోసం వేట ప్రారంభించారు. నదిలో నీళ్లు తక్కువగా ఉండడంతో.. కొందరు బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం వెతుకుతున్నారు. మరికొందరు ఒడ్డునే ఒన్న బురద పెల్లలను తొలగిస్తూ నాణేల కోసం ప్రయత్నిస్తున్నారు.