బస్ షెల్టర్‌ను ప్రారంభించిన గేదె.. ఎక్కడో తెలుసా?

Villagers in karnataka use a buffalo to open bus shelter. ఓ గేదెతో బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి గేదె ఈ కార్యక్రమానికి

By అంజి  Published on  21 July 2022 5:51 AM GMT
బస్ షెల్టర్‌ను ప్రారంభించిన గేదె.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా ఏదైనా ప్రారంభ వేడుకలను రాజకీయ నాయకులతో, సెలబ్రిటీలతో ప్రారంభింపచేస్తారని మనందరికీ తెలుసు. అయితే ఓ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గేదెను ఆహ్వానించారంటే నమ్ముతారా?. నమ్మాల్సిందే ఎందుకంటే కర్ణాటక ప్రాంతంలోని గడగ్‌లో ఇదే జరిగింది. ఓ గేదెతో బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి గేదె ఈ కార్యక్రమానికి హాజరైంది. స్థానికంగా ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారుల పని తీరుతో విసిగి వేసారిన గ్రామస్తులు అందుకు భిన్నంగా ఈ చర్యలు చేపట్టారు.

గడగ్‌లోని బాలెహోసూర్‌కు చెందిన స్థానికులు చాలా కాలంగా బస్ షెల్టర్ కోసం అధికారులను వేడుకుంటున్నారు. అయితే అధికారుల ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, మరికొంత మంది ప్రజలు బస్సు సర్వీసులపై ఆధారపడుతున్నారని, బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.

సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన అసలు బస్ షెల్టర్, నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత కూలిపోవడంతో ప్రజలు తమ బస్సుల కోసం ప్రక్కనే ఉన్న హోటళ్ళు, ఇళ్ల వద్ద వేచి ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత బస్‌ షెల్టర్‌ ప్రాంతం చెత్త కుప్పగా మారింది. దీంతో స్థానికులు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. స్థానికులు వారి దగ్గరున్న వనరులను సేకరించి కొబ్బరి ఆకులతో తాత్కాలిక బస్‌ షెల్టర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అతిథిగా ఒక గేదెతో ఈ తాత్కాలిక షెల్టర్‌ను ప్రారంభించారు.

''బస్ షెల్టర్‌ను పునరుద్ధరించాలని గత రెండేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను కోరుతున్నారు. ఏదో ఒకటి చేస్తామని నాయకులు హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. మేము అధికారుల కోసం ఎదురుచూడకుండా బస్ షెల్టర్‌ను సరిచేయాలని ఎంచుకున్నాము ఎందుకంటే ఇది కేవలం జంక్‌యార్డ్‌గా విస్తరించింది. ప్రజలు ఇప్పటికీ షెల్టర్ లేకుండా బాధపడుతున్నారు.'' అని స్థానికులు తెలిపారు.

ఇదే విషయమై శిరహట్టి ఎమ్మెల్యే రామప్ప లమాని అడగగా.. తనకు బస్‌ షెల్టర్‌ సమస్య లేదా ప్రారంభోత్సవం గురించి తెలియదని చెప్పారు. వెంటనే పరిస్థితిని పరిశీలించి నిర్వాసితులకు కొత్త బస్‌ షెల్టర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Next Story