బిడ్డను ఎత్తుకుని.. మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు
Video of Chandigarh cop holding baby while on duty goes viral.ఓ చేతితో బిడ్డను భుజాన ఎత్తుకుని ఎండలో ఓ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు
By తోట వంశీ కుమార్ Published on 7 March 2021 11:18 AM GMTఓ చేతితో బిడ్డను భుజాన ఎత్తుకుని ఎండలో ఓ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు నిర్వర్తించింది. ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. కాగా.. దీనిపై నెటీజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చండీగడ్‌కు చెందిన ప్రియాంక ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఇటీవల సెక్టర్ 29 వద్ద ఉదయం 8 గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉంది. తొలుత వ్యక్తిగత పనుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయింది. అయితే.. విధులకు హాజరు కావాల్సిందేనని అధికారులు చెప్పడంతో తన బిడ్డతో కలిసి అక్కడి వచ్చి ట్రాఫిక్ విధులను నిర్వర్తించింది.
బిడ్డతో ప్రియాంక విధులు నిర్వర్తించడం చూసిన ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది వైరల్‌లా మారింది. ఆ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ విధి నిర్వహణను కొందరు నెటీజన్లు ప్రశంసించగా.. మరికొందరు మాత్రం ఆమె చర్యను తప్పుబట్టారు. ఓ వైపు కరోనా, మరోవైపు కాలుష్యం ఉన్న పరిస్థితుల్లో ఎండలో రోడ్డుపై బిడ్డతో విధులు నిర్వహించడాన్నితప్పుబట్టారు.
Watch: #Chandigarh traffic police woman #constable performs duty with child, video viral pic.twitter.com/f9j4KzaiXW
— The Tribune (@thetribunechd) March 6, 2021
ఇటీవలే తాను బిడ్డకు జన్మనివ్వడం జరిగిందని.. కొడుకును చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండరని కానిస్టేబుల్ ప్రియాంక వెల్లడించారు. తాను నాలుగు రోజుల క్రితం డ్యూటీలో చేరడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం తన ఇంటికి దూరంగా ఉంటుందని.. విధుల్లో పాల్గొనే సమయంలో ఆలస్యమైందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను తీసుకురావాల్సి వచ్చిందన్నారు. తనకు అనుకూలమైన ప్రాంతంలో విధులు కేటాయించాలన్న తన అభ్యర్థనకు SSP (traffic) అంగీకరిచిందని ప్రియాంక చెప్పింది.