Video: బైక్‌ను ఢీకొట్టిన దిగ్విజయ్ సింగ్ కారు.. ఎగిరిపడ్డ బైకర్
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ కారు వేగంతో వెళ్తూ అదుపుకాకపోవడంతో ఓ బైకర్‌ను ఢీకొట్టింది.
By అంజి
బైక్‌ను ఢీకొట్టిన దిగ్విజయ్ సింగ్ కారు.. ఎగిరిపడ్డ బైకర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ కారు వేగంతో వెళ్తూ అదుపుకాకపోవడంతో ఓ బైకర్‌ను ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో బైకర్ ఎగిపడటంతో తీవ్రగాయాలయ్యాయి. రాజ్‌గఢ్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన బైకర్‌ను వెంటనే రాజ్‌గఢ్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడర్ అనంతరం మెరుగైన వైద్యం కోసం భోపాల్‌లోని ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ పురోహిత్ తల్లి చనిపోయారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఆమెకు నివాళులు అర్పించడానికి దిగ్విజయ్ సింగ్ కొడాక్య గ్రామానికి వెళ్లారు. నివాళులు అర్పించి, ప్రకాశ్ పురోహిత్‌ను పరామర్శించిన అనంతరం ఆయన రాజ్‌గఢ్‌కు తిరుగుపయనం అయ్యారు. రాజ్‌గఢ్‌కు వచ్చిన వెంటనే దిగ్విజయ్ ఫార్చ్యూనర్ కారు.. రోడ్డు క్రాస్ చేయబోయిన బైకర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఎదురుగా వచ్చిన బైకర్ రాంబాబు (20) యూ టర్న్ దగ్గర రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో డ్రైవర్ కారును అదుపుచేయలేక ఢీకొట్టాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్ సింగ్ కారు డ్రైవర్‌ను అదపులోకి తీసుకున్నారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరగ్గానే దిగ్విజయ్ సింగ్ కారుదిగి బాధితుడి దగ్గరికి పరుగుతీసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Congress leader Digvijay Singh 's car hit a bike-borne man in MP's Rajgarh, Driver Akhtar Khan was arrested & car seized by police. pic.twitter.com/JTTmssDjB3
— Political Kida (@PoliticalKida) March 9, 2023