Video: వందే భారత్ స్లీపర్.. ట్రయల్ రన్ సక్సెస్
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్‌ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్‌లోని కోటా - లాబాన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది.
By అంజి Published on 3 Jan 2025 10:36 AM ISTVideo: వందే భారత్ స్లీపర్.. ట్రయల్ రన్ సక్సెస్
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్‌ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్‌లోని కోటా - లాబాన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 30 కిలోమీటర్లు. ఈ సమయంలో ప్రయాణీకుల వాహక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రయల్‌ను ముందుకు తీసుకెళ్లారు. ట్రయల్ రన్‌ను లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది.
కాగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైలు వేగాన్ని క్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంగా నడిచింది. దీనికి సంబంధించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో రైలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది. అంత స్పీడులోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
జనవరి 1వ తేదీన వందే భారత్ స్లీపర్ రైలును 130 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా ఈ వేగాన్ని 180 కిలోమీటర్లకు పెంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో రైలును నడిపారు. ఇవన్నీ విజయవంతంగా జరిగాయి. దీంతో మరికొన్ని నెలల్లో స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.