భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్‌గా డా.వి. నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఆయన సారథ్యంలోనే చంద్రయాన్-3 విజయవంతమైంది. నారాయణన్ ఇప్పటిరకు ఇస్రో సంస్థలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పని చేశారు. నారాయణన్ సారథ్యంలోనే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 ద్వారా సీ25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది.
అలాగే చంద్రయాన్ 2, 3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లకు నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను రూపొందించింది. నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. పాఠశాల విద్యాభ్యాసం అంతా తమిళ్ మీడియంలోనే చదివారు. అనంతరం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ ఇన్ క్రయోజెనిక్ ఇంజినీరింగ్ చేశారు. ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. తర్వాత ఐఐటీ ఖరగ్‌పైర్‌లోనే ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఈ కరమంలోనే రాకెట్ అండ్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ విభాగంలో నారాయణన్ ఆరితేరారు.