కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  21 July 2024 5:55 AM GMT
Uttarakhand, kedarnath yatra, landslide, three dead,

 కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి 

ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కేదార్‌నాథ్‌ నడకమార్గలో కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ల కింద చిక్కుకుని ముగ్గురు భక్తులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే సాయం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అధికారులతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 'కేదార్‌నాథ్ యాత్రా మార్గానికి సమీపంలో ఉన్న కొండపై నుండి శిధిలాలు, భారీ రాళ్లు పడటం వల్ల కొంతమంది యాత్రికులు గాయపడిన వార్త చాలా విచారకరం. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేను నిరంతరం అధికారులతో సంప్రదిస్తాను. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశానని, మృతుల ఆత్మకు భగవంతుడు పాదాల చెంత చోటు కల్పించాలని, మృతుల కుటుంబాలకు ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. అక్కడక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే బండరాళ్లు విరిగిపడుతున్న కారణంగా తనక్‌పూర్ చంపావత్‌ జాతీయ రహదారిని బ్లాక్‌ చేశారు. అంతకుముందు జూలై 10వ తేదీన బద్రీనాథ్ జాతీయ రహదారిపై పాతాల్ గంగా లాంగ్సీ సొరంగం సమీపంలోని కొండపై కొండచరియలు విరిగిపడటంతో రహదారి మూసుకుపోయింది.

Next Story