203 మంది గల్లంతయ్యారట..

Uttarakhand floods LIVE 203 people missing 18 found dead. ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని తెలిపారు.

By Medi Samrat  Published on  8 Feb 2021 1:11 PM GMT
Uttarakhand floods

ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వతాల్లోని నందాదేవి శిఖరం నుంచి మంచు చరియలు విరిగిపడడంతో నదిలోని నీటిమట్టం పెరిగిపోయి లోతట్టు ప్రాంతాలను తుడిచిపెట్టేసింది. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని తెలిపారు. వారిలో 11 మంది మృతదేహాలను వెలికితీశామని వివరించారు. రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని రేణీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే తపోవన్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, అక్కడే అనుబంధంగా మరో సంస్థ కూడా ఉందని సీఎం రావత్ వివరించారు. ఆ సంస్థలో పాతికమంది వరకు పనిచేస్తున్నట్టు సమాచారం ఉందని, వారందరి ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

మంచుకొండలు విరుచుకుపడిన కారణంగా జల విలయం సంభవించిన ఉత్తరాఖండ్ చమేలీ జిల్లాలోని విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన తపోవన్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 16 మందిని ఐటీబీపీ బలగాలు కాపాడాయి. తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ఐటీబీపీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ యంత్రాలతో సొరంగంలో పూడుకుపోయిన బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సొరంగం మొత్తం పొడవు 250 మీటర్లు కాగా, ఆదివారం జవాన్లు 150 మీటర్ల లోపలి వరకు వెళ్లగలిగారు. ధౌలీ గంగ నీటిమట్టం ఆదివారం రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుండడంతో సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు నేటి ఉదయం మళ్లీ ప్రారంభించారు. 170 మంది కార్మికులు పనిచేస్తున్న తపోవన్-రెనీ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో దాంట్లో చిక్కుకుపోయిన కార్మికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ప్రతినిధి చెప్పారు.

ఉత్తరాఖండ్ చమేలీ జిల్లాలోని విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన తపోవన్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 16 మందిని ఐటీబీపీ బలగాలు కాపాడాయి. ఉన్నట్లుండి విరుచుకుపడిన వరద ధాటికి విద్యుత్ ప్రాజెక్టులో ఉన్నవారు గల్లంతు కాగా వీరిలో 16 మందిని ప్రాణాలతో కాపాడారు. ఐటీబీపీ కాపాడిన 16 మందిలో ఒకరిని ఐటీబీపీ నాటకీయంగా కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మా సోదరుడు ఎట్టకేలకు బయటపడ్డాడు. చాలా థ్యాంక్స్.. తాను సంతోషంగా కొత్త జీవితం గడుపుతాడు అంటూ ఒక వ్యక్తి నిట్టూర్పు విడుస్తున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో సహాయ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇంతవరకు 14 శవాలు బయటపడగా, మరో 16 మందిని కాపాడారు.




Next Story