ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 4 Aug 2024 11:31 AM IST

uttar pradesh, road accident, seven dead ,

ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటన ఉస్రహార్ ప్రాంతంలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై శనివారంరాత్రి చోటుచేసుకుంది. బససులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.

రాయ్‌బరేలి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఇటావా వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సుగా పోలీసులు తెలిపారు. దిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఎస్పీ సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. రాంగ్‌ రూట్‌లో వస్తోన్న కారును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణ అనంతరం తెలిపారు. లక్నో నుంచి దిల్లీ వెళ్తున్న కారు డ్రైవర్‌ నిద్రలోకి జారుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కారును ఢీకొట్టిన వెంటనే రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి బస్సు బోల్తా కొట్టిందని పోలీసలు చెబుతున్నారు. ఇక గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నామన్నారు.



Next Story