ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన డంప్ ట్రక్కు, ఐదుగురు దుర్మరణం
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 2 April 2024 11:37 AM ISTఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన డంప్ ట్రక్కు, ఐదుగురు దుర్మరణం
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్రకూట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.
మంగళవారం ఉదయం ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన డంప్ ట్రక్కు ఎదురుగా వస్తోన్న ఆటోను ఢీకొట్టింది. కొత్వాలి ప్రాంతంలోని అమన్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆటోలో ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అలాగే ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందనీ.. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.