Uttarpradesh: విద్యుత్ వైర్లు తగిలి బస్సుకు అంటుకున్న మంటలు
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 11 March 2024 11:15 AM GMTUttarpradesh: విద్యుత్ వైర్లు తగిలి బస్సుకు అంటుకున్న మంటలు
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి పడిపోయింది. దాంతో.. బస్సుకు మంటలు అంటుకున్నాయి. దాంతో.. బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైరు తెగి బస్సుపై పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు పెద్దవిగా మారడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. వారు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. బస్సుకు మంటలు అంటుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ.. మంటలు అదుపులోకి రాలేదు. దాంతో..వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.
సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. పోలీసులు కూడా విషయం తెలుసుకుని సంఘటనాస్థలానికి వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటల్లో చిక్కుకున్న బస్సు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ వైరు తగిలి మంటలు అంటుకున్న సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బస్సులో నుంచి ఆరుగురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. కొందరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.