బస్సుపై డంపర్ బోల్తా.. 11 మంది మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 2:29 AM GMT
uttar pradesh, accident, 11 people dead ,

బస్సుపై డంపర్ బోల్తా.. 11 మంది మృతి 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్పూర్‌లోని ఖుతార్‌ ప్రాంతంలో గోలా-లకింపూర్ రహదారిపై శనివారం రాత్రి ఈప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

షాజహాన్‌పూర్ ఖుతార్‌ పట్టణం దగ్గర రిషి దాబా ఉంది. ఇక రాత్రి లఖింపూర్ నుంచి బయల్దేరిన ఒక ప్రయివేట్‌ బస్సు దాబా దగ్గర ఆగింది. రాత్రి 11 గంటల సమయంలో బస్సు దాబా దగ్గర ఆగి ప్రయాణికులు భోజనం చేసేందుకు నిలపారు. దాంతో.. కొంత మంది బస్సు నుంచి దిగి భోజనం చేసేందుకు వెళ్లారు. చాలా మంది ప్రయాణికులు బస్సులోనే కూర్చుకున్నారు. అప్పుడే ఖుతార్ నుంచి వస్తున్న బ్యాలస్డ్‌ లోడ్‌ డంపర్‌ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ డంపర్‌ బస్సుపైనే పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పెద్ద శబ్దం వచ్చింది. కంగారుపడ్డ స్థానికులు.. మిగతా వాహనదారులంతా అక్కడికి పరుగు తీశారు. బస్సులో నుంచి కేకేలు వినిపించసాగాయి.

ఇక పోలీసులకు సమాచారం ఇవ్వడం.. అక్కడి క్రేన్‌ను రప్పించారు. అప్పటికే బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరిని బయటకు తీశారు. కానీ.. చాలా వరకు బస్సులోనే ఉండిపోయారు. దాదాపు అరగంట తర్వాత క్రేన్ వచ్చింది. దాంతో.. డంపర్‌ను బస్సు పైనుంచి తీసేశారు. ఇక ఎలాగోలా బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది చనిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మరో 30 మంది వరకు గాయాలు అయినట్లు చెప్పారు.

కాగా.. సీతాపూర్‌ జిల్లా సిధౌలిలోని కమ్లాపూర్‌ పీఎస్‌ పరిధిలోని బడా జాతా గ్రామానికి చెందిన సుమారు 70 మంది శనివారం సాయంత్రం 11 గంటల సమయంలో పూర్ణగిరి మాత దర్శనానికి వెళ్లినట్లు చెప్పారు.

Next Story