భారతీయుల విజిటింగ్ వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించడానికి ముందుకొచ్చిన అమెరికా
US Embassy has come forward to reduce the waiting time of visiting visa for Indians. వీసా దరఖాస్తుదారుల వెయిటింగ్ సమయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అమెరికా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Jan 2023 1:01 PM IST
వీసా దరఖాస్తుదారుల వెయిటింగ్ సమయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అమెరికా ముందుకు వచ్చింది. భారతదేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు శనివారం కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. శనివారం ( జనవరి 21న) ఇంటర్వ్యూలు నిర్వహించాయి. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లు అన్నీ వ్యక్తిగత వీసా ఇంటర్వ్యూలకు శనివారం నాడు కాన్సులర్ కార్యకలాపాలను ప్రారంభించాయి. రాబోయే నెలల్లో శనివారాల్లో అపాయింట్‌మెంట్‌ల కోసం అదనపు స్లాట్‌లను ఇవ్వనున్నారు. వీసా కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న నేపథ్యంలో దౌత్య కార్యాలయాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్లు శనివారం ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహించాయి. వచ్చే నెలలోనూ ఎంపిక చేసిన శనివారాల్లోనూ వీసా దరఖాస్తుదారుల కోసం అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఎంబసీ.. కాన్సులేట్‌లకు అధికారుల సంఖ్యను కూడా పెంచుతోంది. ఇంటర్వ్యూల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో యూఎస్ కాన్సులెట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే గతంలో వీసాలు కలిగిన దరఖాస్తుదారుల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఇంటర్వ్యూ మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది. ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుంచి తాతాలికంగా, అదనంగా కాన్సులర్ అధికారులను భారత్‌కు పంపింది. U.S. మిషన్ లో భాగంగా అమెరికా 250,000 కంటే ఎక్కువ అదనపు B1/B2 అపాయింట్‌మెంట్‌లను విడుదల చేసింది. అదనపు అపాయింట్‌మెంట్‌ల కోసం కాన్సులేట్ జనరల్ ముంబైలో కూడా పని వేళలను పొడిగించింది. COVID-19 మహమ్మారికి ముందు స్థాయిలలో వీసాలను ప్రాసెస్ చేయాలని అమెరికా అధికారులు భావిస్తూ ఉన్నారు.
COVID-19 మహమ్మారి ఫలితంగా డిపార్ట్‌మెంట్ వీసా ప్రాసెసింగ్ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. అమెరికా ఎంబసీలు, కాన్సులేట్‌లు చాలా వరకు అత్యవసర సేవలను మాత్రమే అందించాయి. ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడంతో U.S. మిషన్ టు ఇండియా ద్వారా చట్టబద్ధమైన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది. 2022లో 800,000 కంటే ఎక్కువ వలసేతర వీసాలను ఇచ్చారు. "భారతదేశంలోని మా కాన్సులర్ బృందాలు అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి మరియు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి అదనపు గంటలను వెచ్చిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి వినూత్న పరిష్కారాలను కనుగొనే మిషన్ లో భాగంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం" అని ముంబై కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ అన్నారు. గతంలో అమెరికా వీసా కలిగిన వారికి ఇంటర్వ్యూ లేకుండా రిమోట్ ప్రాసెసింగ్ విధానాన్ని అమెరికా విదేశాంగ శాఖ అమలు చేస్తోంది. ఈ వేసవికల్లా భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో అదనపు సిబ్బంది సాయంతో వీసాల జారీ ప్రక్రియ కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.