ఆ రైల్వే స్టేషన్ పేరును కూడా మార్చేసిన యోగి ఆదిత్యనాథ్

UP govt gives nod to rename Faizabad station Ayodhya Cantonment. ఉత్తర‌ప్రదేశ్ లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్య

By M.S.R  Published on  24 Oct 2021 11:46 AM GMT
ఆ రైల్వే స్టేషన్ పేరును కూడా మార్చేసిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తర‌ప్రదేశ్ లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ గా మార్చనుంది. ఇంతకు ముందు 2018 లో ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు రైల్వే స్టేషన్ పేరు మార్చనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయానికి కేంద్రం కూడా ఆమోద ముద్ర వేయటంతో యోగి సర్కార్ రైల్వే స్టేషన్ పేరు మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీ లోని అలహాబాద్ రైల్వే‌స్టేషన్‌ను ప్రయాగ్‌రాజ్ గాను, ముగల్ సరాయ్ రైల్వే‌స్టేషన్‌ను పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్లుగా మార్చింది.

మూడేళ్ల కిందట దీపావళి సందర్భంగా ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన యూపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఫైజాబాద్ జంక్షన్ పేరును అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్‌గా మార్చడానికి ఆమోదించింది. అయోధ్య బీజేపీ ఎంపి లల్లూ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రైల్వేకు పేరు మార్పును సిఫార్సు చేసిన తర్వాత ఈ ప్రతిపాదన కేంద్రానికి పంపబడింది. "2018లో ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మార్చిన తర్వాత రైల్వే జంక్షన్‌కు అయోధ్య పేరు పెట్టడం సహజమైన ప్రక్రియ. గందరగోళాన్ని నివారించడానికి ఇది జరుగుతోంది. స్థానిక ఎంపీ ప్రతిపాదనను పంపారు, మరియు అవసరమైన ఆమోదాల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం దానిని కేంద్రానికి పంపింది. స్టేషన్ పేరు మార్చడం రైల్వే ద్వారా మాత్రమే అమలు చేయబడుతుంది " అని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు.


Next Story