ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అప్నాదళ్-కామెరవాడితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరు పార్టీల కూటమిలో సీట్ల భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించారు. “మేము మా సోదరి డాక్టర్ పల్లవి పటేల్ (అప్నా దళ్ కెమెరావాడి)తో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం. రెండు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. మిగిలిన సీట్లను పల్లవి పటేల్ నిర్ణయిస్తారు. ఈ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం అని ప్రకటించారు.
నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో AIMIM రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. అక్టోబర్ 15న ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్‌లోని 9 స్థానాలు, కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానంతో సహా 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది. అయితే.. కార్తీక పూర్ణిమ పండుగను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 13 నుండి నవంబర్ 20 వరకు ఉప ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారికంగా ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.
అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ మొత్తం 15 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.