పెళ్లి కాని యువకుల్లారా.. ఆమె నుండి జాగ్రత్తగా ఉండండి

Unmarried youth be careful! 'Babli' is making young men its prey. దేశవ్యాప్తంగా అనేక విచిత్రమైన కేసులు నమోదవుత్తో ఉన్నాయి. అలాంటి కోవకే చెందినది ఇది కూడా..! పెళ్లికాని వారిని లక్ష్యంగా చేసుకుని కాంట్రాక్ట్

By M.S.R
Published on : 4 Jan 2022 9:45 PM IST

పెళ్లి కాని యువకుల్లారా.. ఆమె నుండి జాగ్రత్తగా ఉండండి

దేశవ్యాప్తంగా అనేక విచిత్రమైన కేసులు నమోదవుత్తో ఉన్నాయి. అలాంటి కోవకే చెందినది ఇది కూడా..! పెళ్లికాని వారిని లక్ష్యంగా చేసుకుని కాంట్రాక్ట్ మ్యారేజ్‌లను కొనసాగించే ముఠాను ఇండోర్ కు చెందిన పరదేశపుర పోలీసులు పట్టుకున్నారు. గ్యాంగ్‌లో ఉన్న అందమైన యువతి తనను తాను పెళ్ళికి రెడీ అని చెప్పుకునేది.. పేద కుటుంబానికి చెందిన దాన్ని అని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించేది. అమ్మాయి తల్లిని కూడా రంగంలోకి దింపి.. పెళ్లికి సిద్ధమేనని చెప్పించేది. వీరిద్దరికీ ఒక ఏజెంట్ సహాయం చేసే వాడు. అలా ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో మాయలో పలువురు పెళ్లి కాని అబ్బాయిలు పడినట్లు తెలుస్తోంది.

తపునగర్‌కు చెందిన చందు ఫిర్యాదు మేరకు నిందితులైన భగీరథపురాకు చెందిన మహేంద్ర , పూజా, లక్ష్మి లపై మోసం కేసు నమోదు చేసినట్లు టిఐ పంకజ్ ద్వివేది తెలిపారు. చందు తెలిపిన వివరాల ప్రకారం.. నేరస్థురాలు పూజ, ఆమె తల్లి లక్ష్మి గతంలో అతడి ఇంటి సమీపంలోనే ఉండేవారు. దీంతో ఏజెంట్ ద్వారా పెళ్లి చర్చలు జరిగాయి. నేరగాళ్లు ముందుగా రూ.30 వేలు తీసుకున్నారు. అనంతరం మళ్లీ 44వేలు తీసుకున్నారు. పెళ్లికి ముందు నగలు, చీరలు, బట్టలు కూడా కొనిచ్చుకున్నారు. తీరా పెళ్లి సమయంలో ఆమె తప్పించుకుని పారిపోయేది.

ఏజెంట్ మహేంద్ర కూడా అక్కడి నుండి పారిపోయాడు. సోమవారం కలాలి సమీపంలో మహేంద్రను పట్టుకున్న చందు.. తల్లీకూతుళ్లు భగీరథపురలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించాడు. పోలీసులు కూడా అర్థరాత్రి పూజను అదుపులోకి తీసుకున్నారు. పూజకు వివాహమైందని విచారణలో తేలింది. ఆమె పలువురిని ఇలాగే మోసం చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని నగలు, డబ్బు తీసుకుని పారిపోయింది. ఒక్కో చోట ఒక్కో పేరుతో పలువురిని మోసం చేసింది ఈ గ్యాంగ్.

Next Story