కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి

Union Minister Nisith Pramanik's convoy attacked by Trinamool supporters in Bengal. బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో శనివారం కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై

By Medi Samrat  Published on  25 Feb 2023 3:45 PM GMT
కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి

బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో శనివారం కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేశారు. హోం, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ కూచ్ బెహర్‌లోని దిన్‌హటా ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలను కలవడానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. టీఎంసీ మద్దతుదారులు మంత్రి కారుపై రాళ్లు రువ్వడంతో పాటు ముందు అద్దాన్ని పగులగొట్టారు. మంత్రికి వ్య‌తిరేకంగా నల్లజెండాలు ప్ర‌ద‌ర్శించిన‌ట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

బిజెపి మద్దతుదారులు "జై శ్రీరాం" నినాదాలు చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తన కారు దిగి అక్కడికక్కడే పార్టీ మద్దతుదారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దాడి చేసిన వారికి టీఎంసీ ఆశ్రయం ఇస్తోందని ప్రామాణిక్ ఆరోపించారు. బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రి కారుపై ఈ విధంగా దాడి జరిగితే, రాష్ట్రంలోని సామాన్య ప్రజల భద్రత గురించి ఆలోచించండి”.. రాష్ట్రంలో ఆర్టికల్ 365 విధించే చర్యలను గవర్నర్ ప్రారంభించాలని అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ నేత జైప్రకాష్ మజుందార్ దీనికి కౌంటర్ ఇస్తూ.. దిలీప్ ఘోష్, సువేందు అధికారి వంటి బీజేపీ నేతలు బెంగాల్‌లో శాంతికి విఘాతం కలిగించేలా పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనకు టీఎంసీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. "ఆ ప్రాంతంలో ప్రజల నుండి చాలా ఆగ్రహం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు’’ అని అన్నారు.



Next Story