వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ: కేంద్రమంత్రి

బడ్జెట్‌లో ప్రకటించినట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని ఈపీఎఫ్‌ అకౌంట్లలో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

By అంజి  Published on  22 Sep 2024 3:30 AM GMT
Union minister Mansukh Mandaviya, EPFO, ESIC, Telangana

వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ: కేంద్రమంత్రి

హైదరాబాద్‌: బడ్జెట్‌లో ప్రకటించినట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని ఈపీఎఫ్‌ అకౌంట్లలో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ మేరకు గరిష్ఠంగా ఒక ఉద్యోగికి గరిష్ఠంగా రూ.15 వేలు అందనుంది. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96 లక్షల మంది చందాదారులు, 4.54 లక్షల మంది పెన్షన్‌ తీసుకునేవారు ఉన్నట్టు కేంద్రమంత్రి హైదరాబాద్‌లోని పీఎఫ్‌ కార్యాలయంలో తెలిపారు. హైదరాబాద్‌లో ర్కత్‌పురలో ఉన్న పీఎఫ్‌ కా ర్యాలయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( ఈపీఎఫ్‌వో ), ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) పై మన్‌సుఖ్‌ మాండవ్య బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈపీఎఫ్‌ తెలంగాణ జోన్‌లో ఏటా రూ.7,797కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. యువ ఉద్యోగుల కోసం కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌(ఈఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ పథకం కింద.. మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతీయువకులకు ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుందన్నారు.

Next Story