Video : పార్లమెంటులో క‌లిసిన ఆ సినిమా హీరో హీరోయిన్లు

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కంగనా రనౌత్ వార్త‌ల్లో నిలిచారు

By Medi Samrat  Published on  26 Jun 2024 3:50 PM IST
Video : పార్లమెంటులో క‌లిసిన ఆ సినిమా హీరో హీరోయిన్లు

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కంగనా రనౌత్ వార్త‌ల్లో నిలిచారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా బీహార్‌లోని హాజీపూర్ ఎంపీగా గెలిచారు. అంతేకాదు త‌మ‌ పార్టీ పోటీ చేసిన‌ ఐదుకు ఐదు ఎంపీ స్థానాల్లో గెలిపించుకుని హాట్ టాఫిక్ అయ్యారు. అయితే కంగనా, చిరాగ్ గ‌తంలో ఓ సినిమాలో న‌టించారు. చిరాగ్, కంగనా జంట 13 ఏళ్ల క్రితం ఓ సినిమాలో కనిపించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ హాట్ టాఫిక్ అయ్యారు.

కొత్తగా ఎన్నికైన ఎంపీలిద్దరూ పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఆ సమయంలో కంగనా, చిరాగ్‌ల మధ్య చిన్న‌పాటి చిట్‌చాట్‌ జరిగింది. కంగ‌నాను చిరాగ్‌ ఆప్యాయంగా ద‌గ్గ‌రికి తీసుకున్నారు. ఆ త‌ర్వాత కంగ‌నా.. చిరాగ్‌తో న‌వ్వుతూ మాట్లాడుకుంటూ చేతిలో చేయి వేసి పార్ల‌మెంట్ హౌస్‌లోకి వెళుతారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం వైరల్‌ అవుతోంది.

చిరాగ్ పాశ్వాన్ తన తొలి చిత్రంలో కంగనా రనౌత్‌తో కలిసి పనిచేశాడు. 13 ఏళ్ల క్రితం వీరిద్ద‌రు న‌టించిన ‘మిలే న‌మిలే హమ్‌’ సినిమా విడుద‌లైంది. ఇందులో కంగనా కథానాయిక. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్ట‌ర్ ప్లాప్‌గా నిలిచింది.

Next Story