భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అతిపెద్ద చర్యగా హోం మంత్రిత్వశాఖ (MHA) దాదాపు 16,000 విదేశీయులను దేశనిర్బంధం (డిపోర్ట్) చేయడానికి సిద్ధమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ చర్య చేపట్టబడుతోంది.
వీరిపై డ్రగ్ స్మగ్లింగ్ నుంచి రవాణా వరకు వివిధ ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధంలో ఉన్నారు. విదేశీయుల పూర్తి జాబితా ఇప్పటికే హోంశాఖతో పాటు సంబంధిత ఏజెన్సీలకు చేరింది. కొత్త ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం వీరిని డిపోర్ట్ చేసే ప్రక్రియ త్వరలోనే అమలులోకి రానుంది.