Video: కుప్ప కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించాలని

By అంజి  Published on  5 Jun 2023 2:30 AM GMT
Bihar, bridge,  Aguwani Sultanganj bridge, Bhagalpur, Khagaria district

Video: కుప్ప కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించాలని భవన నిర్మాణ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అధికారి తెలిపారు. భాగల్‌పూర్‌ను ఖగారియా జిల్లాతో కలిపే అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన చెప్పారు. "అగువానీ-సుల్తంగంజ్ నిర్మాణంలో ఉన్న వంతెన యొక్క నాలుగు-ఐదు స్తంభాలు గంగా నదిలో కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది" అని అధికారి తెలిపారు.

భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ.. “అవును, అగువానీ-సుల్తంగంజ్ నిర్మాణంలో ఉన్న వంతెన యొక్క 4-5 స్తంభాలు కూలిపోయినట్లు నాకు సమాచారం అందింది. పరిపాలన సంబంధిత శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ అంశంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రత్యయా అమృత్‌ను ఆదేశించారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఈ ఘటన తెలియజేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి తక్కువ ప్రమాణాలతో కూడిన పదార్థాలు ఉపయోగించబడ్డాయి. బీహార్ అభివృద్ధిపై సీఎంకు కనీసం పట్టింపు లేదు... ఆయన పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి అని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక భాగం కూలిపోవడంతో ఒక కార్మికుడు మరణించగా, మరొకరు గాయపడడం గమనార్హం.

Next Story