కరోనా వాక్సిన్ బ్లాక్ లో అమ్మేశారు.. ఏంతంటే
Unauthorised vaccination site at Assam govt hospital busted. అస్సోమ్ లో కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు బృందాలు గా మారి కోవిడ్ టీకాలను ప్రజలకు అమ్మడం మొదలు పెట్టారు.
By Medi Samrat
కబళిస్తున్న కరుణ మహమ్మారి తో పోరాడటానికి జనం నానా బాధలు పడుతున్నారు. కరోనా మొదటి దశలో అసలు వ్యాధి గురించి, మందుల గురించి అవగాహనే లేదు. తర్వాత కాస్త తెలుసుకొని వ్యాక్సిన్ కనిపెట్టారు. వాక్సిన్ వేయించుకుంటేనే కరోనా నుంచి తప్పించుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా టీకాను ప్రజలందరికీ అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతున్నాయి. ఇదే సమయంలో కొందరి స్వార్థం మితిమీరిపోతోంది. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే కొంతమంది కాసుల కోసం ఎప్పటిలాగే కక్కుర్తి పడుతున్నారు. బృందాలుగా ఏర్పడి మందుల, వాక్సిన్ ల పేరుతో ప్రజలను కొల్లగొడుతున్నారు.
తాజాగా అస్సోమ్ లో ఇలాంటి సంఘటన జరిగింది. కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు బృందాలు గా మారి కోవిడ్ టీకాలను ప్రజలకు అమ్మడం మొదలు పెట్టారు. వాక్సిన్ అందుతుందో లేదో అన్న భయంతో సుమారు 80 మంది డబ్బులు ఇచ్చి వీరివద్ద టీకాలు వేయించుకున్నారు.
అస్సాంలోని కాచార్ జిల్లా లోని సిల్చార్ సివిల్ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఒక్కొక్కరి నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేసి 80 మందికి కోవిషీల్ వాక్సిన్ వేశారు. ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పేరుతో పది బాక్స్ ల టీకాలు తీసుకొని దానిని అక్కడే మరో గదికి తరలించి డబ్బులు తీసుకొని టీకాలు వేసినట్టుగా సమాచారం. సంఘటనా స్థలంలో 100కి పైగా ఉపయోగించిన సిరంజీలు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించిన కొన్ని ఖాళీ సీసాలు దొరికాయి.
ఆసుపత్రిలోని ఒక రూమ్లో ఎక్కువ మంది జనాలు గుమ్మిగూడి ఉండటం అనుమానాలు రేకెత్తించడంతో ఒక మెడికల్ అధికారి తన పై అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగం లోకి దిగిన ఉన్నతాధికారులు, డబ్బులు తీసుకోవడంతో పాట కనీసం వాక్సిన్ వేసుకున్న వారి వివరాలు కూడా సేకరించకుండా టీకాలు వేసినట్లుగా తెలుసుకొని అవాక్కయ్యారు. ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.