ఢిల్లీ లో కరోనా ఉదృతికి కారణం అదేనా..!

UK Covid-19 variant driving Delhi surge.దేశ రాజధానిగా అన్నింటా ముందుండే ఢిల్లీ, ఇప్పుడు కరోనా ఉదృతిలో కూడా ముందుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2021 3:22 AM GMT
ఢిల్లీ లో కరోనా ఉదృతికి కారణం అదేనా..!

దేశ రాజధానిగా అన్నింటా ముందుండే ఢిల్లీ, ఇప్పుడు కరోనా ఉదృతిలో కూడా ముందుంది. వారం క్రితం రోజువారీ మరణాలు 140 లోపే ఉండగా.. తాజాగా రెట్టింపును దాటి నమోదవుతున్నాయి. పది రోజుల్లో ఏకంగా 1,750 మంది ప్రాణాలే కోల్పోయారు. ఎన్నడూ లేనంతగా 36.24 పాజిటివ్‌ రేటు నమోదైంది. ఈ స్థాయిలో పాజిటివ్‌లు రావడానికి కారణం యూకే స్ట్రెయిన్‌ ప్రధాన కారణమని జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం (ఎన్‌సీడీసీ) చేపట్టిన నమూనాల జన్యు విశ్లేషణలో తేలింది.

మార్చి నెల ఆఖరులో జరిపిన విశ్లేషణలో 50 శాతం నమూనాల్లో ఈ స్ట్రెయిన్‌ ఉన్నట్లు స్పష్టమైంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీలో ప్రధానంగా అవి కొవిడ్-19-బి.1.617 (డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్), యూకే స్ట్రెయిన్ వేరియంట్ కరోనా వైరస్‌లు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ పరివర్తనలు, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి రెండు, నాలుగు వారాల్లో ఢిల్లీలో కరోనా సోకిన వారి నమూనాలకు పరిశీలించారు. రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్‌ బయటపడగా.. అదే నెల చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు. తద్వారా ఢిల్లీలో వైరస్‌ విలయతాండవానికి యూకే వేరియంట్‌ కారణమై ఉండవచ్చని భావిస్తున్నామన్నారు.


Next Story