భారతదేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువైపోతూ ఉంది. దీంతో వ్యాక్సినేషన్ల సంఖ్యను పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ను వేస్తూ ఉన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకునే వారికి ఉబర్ ఫ్రీ రైడ్స్ ను వాడుకోవచ్చు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన ఫ్రీ రైడ్స్ ను ఉబర్ సంస్థ అందించబోతోంది.
మూడో దశలో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అనుకుంటున్న 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకుని వెళ్తామని.. ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలని ఉబర్ సంస్థ తమ బ్లాగ్ లో తెలిపింది. అందుకు సంబంధించిన ప్రోమో కోడ్స్ ను వాడుకోవాలని సూచించింది. కొన్ని ఎన్.జీ.ఓ. లకు సంబంధించి ఉన్న ప్రోమో కోడ్లను ఉపయోగించుకుని ఈ ఫ్రీ రైడ్ స్కీమ్ లను వాడుకోవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీఘర్, ఉత్తరాఖండ్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు మరికొన్ని ప్రాంతాల్లో మొదలైంది.
ఈ ఆఫర్ ను పొందాలంటే..
— ఉబర్ యాప్ ను ఓపెన్ చేయాలి, మెయిన్ మెనూ లోని Wallet ఆప్షన్ లోకి వెళ్ళాలి
— అక్కడి 'Add Promo Code' లో 10M21V ప్రోమో కోడ్ ను ఉపయోగించాలి
— కోడ్ ను యాడ్ చేశాక.. మీ ప్రోమో కోడ్ తో రైడ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు
— దగ్గరలోని Ministry of Health and Family Welfare Authorised వ్యాక్సినేషన్ సెంటర్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెంటర్ ను యాడ్ చేయాలి
— రైడ్స్ హోమ్ స్క్రీన్ లోకి వెళ్లి pick-up/drop-off లొకేషన్ లో చూడొచ్చు
— అప్పుడు ట్రిప్ ను confirm కొట్టాలి
ఈ ఫ్రీ రైడ్ మ్యాగ్జిమమ్ ధర 150 రూపాయలు ఆఫర్ వస్తుంది. రెండు ఉచిత రైడ్స్ ను యూజర్ కి ఇస్తారు. CoWin, Aarogya Setu యాప్స్ లో వ్యాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.