పరస్పరం భర్తలను పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ప్రేమించి మరీ..

బీహార్‌లోని ఖగారియాలో ఇద్దరు మహిళలు ఒకరి భర్తను మరొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

By అంజి
Published on : 2 March 2023 2:36 PM IST

Bihar, Love quadruple , Khagaria

పరస్పరం భర్తలను పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు (ప్రతీకాత్మక చిత్రం)

బీహార్‌ రాష్ట్రంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఖగారియాలో ఇద్దరు మహిళలు ఒకరి భర్తను మరొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన తెలిసి స్థానికులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నీరజ్ కుమార్ సింగ్, రూబీ దేవి 2009లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.. మొత్తం నలుగురు పిల్లలకు వీరూ తల్లిదండ్రులు. అయితే, తర్వాత రూబీ తన తల్లిదండ్రుల ఇంటికి సమీపంలో ఉండే ముఖేష్ కుమార్ సింగ్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

అది వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో, రూబీ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌తో పాటు తన ముగ్గురు పిల్లలను పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. రూబీ తన మొదటి భర్త నీరజ్ దగ్గర ఆడపిల్లను వదిలేసి వెళ్లింది. అయితే యాదృచ్ఛికంగా, ముఖేష్ కుమార్‌ సింగ్‌ భార్య పేరు కూడా రూబీ దేవినే. నీరజ్‌కి రూబీ (ముఖేష్ భార్య) గురించి తెలిసింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న కోర్టులో పెళ్లి చేసుకున్నారు. నీరజ్ ముఖేష్ పిల్లలను అంగీకరించాడు. కొత్త జంటలు ఇద్దరూ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో నివసిస్తున్నారు.

Next Story