శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదుల హతం

Two terrorists killed in encounter in Srinagar.జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతోంది. శ్రీన‌గ‌ర్‌లోని రైనావారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 8:39 AM IST
శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతోంది. శ్రీన‌గ‌ర్‌లోని రైనావారి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రైనా వారి ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో స్థానిక పోలీసుల‌తో క‌లిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు అక్క‌డ‌కు చేరుకున్నాయి. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదులు.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పులు జ‌రిపారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎద‌రుకాల్పులు జ‌రిపాయి. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు లష్కరే తొయిబాకు (LeT) చెందిన ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు.

ఉగ్రవాదుల్లో ఒకరైన రయీస్ అహ్మద్ భట్ అనంత్‌నాగ్‌లో ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ 'వ్యాలీ న్యూస్ సర్వీస్'ను నడుపుతున్న మాజీ జర్నలిస్టు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. భట్ గత సంవత్సరం ఆగస్టులో లష్కరే తోయిబా యొక్క తీవ్రవాద ర్యాంక్‌లో చేరాడన్నారు. ఉగ్రవాద నేరాలకు సంబంధించి అతనిపై ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. హతమైన రెండో ఉగ్రవాదిని బిజ్‌బెహరాకు చెందిన హిలాల్ అహ్ రాహ్ గుర్తించామ‌ని, అత‌డిని 'సి' కేటగిరీ టెర్రరిస్టు అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.

Next Story