బందిపొరాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two terrorists killed by security forces in Bandipora encounter.జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో శ‌నివారం ఉగ్రవాదులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 6:08 AM GMT
బందిపొరాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో శ‌నివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్ర‌వాదులు హతమయ్యారు. ఉత్త‌ర క‌శ్మీర్‌లోని బండిపొరాలో సుంబ్లార్ ప్రాంతంలోని షోక్‌బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యార‌ని తెలిపారు. వారు ఏ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన‌వార‌నే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌న్నారు.

కాగా..గత వారం రోజుల్లోనే ఈ లోయలో పలు ఎన్‌కౌంటర్లు జరిగిగాయి. బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఇటీ) ఉగ్రవాదులు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it