జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ పోలీసుకు గాయాలయ్యాయి. ఇది పెద్ద విజయమని కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ అభివర్ణించారు.
బెమీనా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారంతో పోలీసులు, భద్రతాబలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిగా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపింది. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వారు లష్కరే తొయిబాకు చెందిన వారు. అందులో ఒకరిని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌కు చెందిన ఆదిల్ హుస్సెయిన్ గా గుర్తించాం. అతడు 2018 నుంచి పాక్‌లో ఉంటున్నాడు. మరొకరిని పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ నివాసి అబ్దుల్లా ఘోరీగా గుర్తించామని అని విజయ్ కుమార్ తెలిపారు.