అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఒకే రోజు రెండు సార్లు భూకంపం

Two Earthquakes of more than 4.0 magnitude strikes andaman and nicobar islands.అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 11:18 AM IST
అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఒకే రోజు రెండు సార్లు భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో దీవుల్లో భూ కంపం సంభవించింది. దీని తీవ్ర‌త రిక్టర్‌ స్కేల్‌పై 4.3 గా న‌మోదు అయ్యింద‌ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. క్యాంప్‌బెల్‌ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఉద‌యం 7.21 గంట‌ల స‌మ‌యంలో మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 4.6గా న‌మోదు అయ్యింది. కాగా.. ఈ రెండు భూ కంపాల వ‌ల్ల ఎటువంటి ప్రాణ, అస్తి నష్టానికి సంబంధించి సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. వరుస భూకంపాలతో ఈశాన్య భారతం వణికిపోతుంది. సోమవారం మణిపూర్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. మొయిరాంగ్‌కు 49 కిలోమీటర్ల దూరంలో.. భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే భయపడాల్సిన పనిలేదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపారు. ఇవీ వాతావరణ మార్పుల వల్లే వచ్చేవని పేర్కొన్నారు.

భూకంపం ఎందుకు వస్తుంది..?

భూకంపాలు రావడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం కూడా చాలా ఉందంటున్నారు. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వ‌ల్ల‌, అధికమైన భూగ‌ర్భ జ‌లాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయ‌డం, అడవుల్లో చెట్ల‌ను న‌రికివేయ‌డం వంటి వ‌ల్ల భూకంపాలు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

అయితే.. భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే, ఆ పొర క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటక్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పొలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8 వేల డిగ్రీల సెల్పియస్. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్, క్రెస్ట్ లను చేధించుకొని బయటకు రావడం కొన్ని చోట్ల జరుగుతుంది. దీన్ని అగ్ని పర్వతం బద్దలైందని అంటుంటారు.

భూమిలో ఉన్న పొరల కదలికలతో అనేక నష్టం..

భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు వివ‌రిస్తున్నారు. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే అనేక నష్టం వాటిల్లుతుంది. ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైన క్రెస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. అయితే భూమిలో 12 పొరలు ఉంటాయని చెబుతున్నారు. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పటంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపలు ఏర్పడే అవకాశాలుంటాయ‌ని చెబుతున్నారు. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి.

Next Story