రాహుల్ గాంధీకి ట్విట‌ర్ షాక్‌.. ట్వీట్ తొల‌గింపు

Twitter takes down Rahul Gandhi's tweet that disclosed rape victim's identity.కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీకి ట్విట్ట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 7:02 AM GMT
రాహుల్ గాంధీకి ట్విట‌ర్ షాక్‌.. ట్వీట్ తొల‌గింపు

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీకి ట్విట్ట‌ర్ షాకిచ్చింది. రాహుల్ గాంధీ ట్వీట్‌ను తొల‌గించింది. ఢిల్లీలో అత్యాచారం మ‌రియు హ‌త్య కేసు బాధితురాలి త‌ల్లిదండ్రుల‌ను క‌లిసిన రాహుల్‌.. ఆ ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో బాధితురాలి త‌ల్లిదండ్రుల ముఖాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.

ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు చిల్డ్రన్స్ కమిషన్ రాసిన లేఖలో, మైనర్ బాధితుల కుటుంబ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సెక్షన్ 74 మరియు బాల లైంగిక నిరోధం సెక్షన్ 23 కింద నేరం.. నేరాల చట్టం (POCSO) ఉల్లంఘన కూడా అని చెప్పింది. ముఖ్యంగా అత్యాచార బాధితురాలి ఫోటోను, వారి ఐడెంటిటీని బహిర్గతం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్ స్పష్టంచేసింది. దీంతో ఈ విష‌యంపై ట్విట్ట‌ర్ ఇండియా స్పందించింది. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా పోస్ట్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని.. స‌ద‌రు ట్వీట్‌ను తొల‌గిస్తున్న‌ట్లుగా నోటిఫికేష‌న్ ద్వారా రాహుల్ గాంధీకి స‌మాచారం ఇచ్చి ట్వీట్‌ను తొల‌గించింది.

Next Story
Share it