సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చింది. భారత్‌లో ఉన్న చట్టాలకు లోబడే పనిచేయనున్నామని.. భారత ప్రభుత్వంతో చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పింది. ఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరిగిన కొన్ని ఘటనల పట్ల ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ సంస్థ ఉద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ట్విట్టర్ ఖండించింది. స్వేచ్చాయుత ఐటీ రూల్స్‌కు అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని ట్విట్టర్ తెలిపింది.
ఉద్యోగుల భద్రతపై ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఓ బీజేపీ నేత ట్వీట్ల విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు ఆమోద్యయోగంగా లేదని ఆ సంస్థ చెప్పింది. మహమ్మారి వేళ తమ సేవలు కీలకంగా నిలిచాయని, ఎంతో మందికి మద్దతు ఇచ్చినట్లు ట్విట్టర్ వెల్లడించింది. కొత్తగా తెచ్చిన ఐటీ చట్టాల్లో కొన్ని మార్పులు చేయాలన్న సూచన చేసింది. భావ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. భారత్ లోని తమ ఉద్యోగులు, వాక్ స్వాతంత్య్రంపై తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. భారత ప్రజలకు సేవ చేసే విషయంలో ట్విట్టర్ ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తోందని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా తాము చేస్తున్న విధంగానే... ఇండియాలో కూడా తమ సేవలను పూర్తి పారదర్శకతతో కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరి గొంతుకను తమ ద్వారా వినిపిస్తామని తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలు తమకు ఇబ్బందికరంగా మారాయని.. బహిరంగ చర్చల ద్వారా తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపింది. భారత ప్రభుత్వంతో కూడా నిర్మాణాత్మకమైన చర్చలు జరుపుతామని వెల్లడించింది.